YSRCP Leader Land Encroachment: నెల్లూరు జిల్లాలో ఇంకా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో భూ కబ్జాలు చేస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చినా రెవెన్యూ అధికారులు స్పందించడంలేదు. ఏ.ఏస్.పేట మండలంలో ఓ వైఎస్సార్సీపీ నాయకుడు గ్రామస్థులను బెదిరించి ఏకంగా 20 ఎకరాలు ఆక్రమించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే తన పొలం పక్కనే ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే వారిని బెదిరిస్తున్నాడు. గ్రామస్థులు వేసుకున్న రోడ్డును ధ్వంసం చేయడంతో వారం కిందట మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు.