Minister Mandipalli on peddireddy Land Grabbing: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్షన్నర ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.