Pawan Kalyan Prayaschitta Deeksha Conclude: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. శ్రీవారి దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం, రేపు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు.