Devadula Lift Irrigation Project Works : దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష ముగిసింది. ప్రాజెక్టు ఇంటెక్ వెల్, పంప్ హౌస్‌ను మంత్రులు పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అధికారులతో సమక్ష నిర్వహించారు. 2026 మార్చికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.