Jana Senas aggression against YS Jagan,s government intensified | వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేనాని దూకుడును ఉధృతం చేశారు. ఆ పార్టీ నేతలకు, మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పలువురు మంత్రుల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నలు సంధించారు. ''మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేస్తారా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?'' అంటూ జనసేన నిలదీసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, రోజా, విడుదల రజనీ, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజాలను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలను సంధించారు.
#YSRCP
#Janasena
#PavanKalyan
#APministers
#CMjagan