India vs Pakistan Head to Head Records In Asia Cup | భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2022 టోర్నీ వేదికగా రసవత్తర పోరుకు రంగం సిద్ధమవుతుంది. ఆగస్టు 28న దుబాయ్ స్టేడియం క్రికెట్ సమరానికి రంగస్థలం కాబోతుంది. బ్యాట్లే ఆయుధాలు.. బంతులే ఫిరంగులుగా సాగే సమరమిది. నువ్వానేనా అన్నట్లు కొదమ సింగాల్లా తలపడే ప్లేయర్లే వారియర్లు. క్షణ క్షణం చేతులు మారే విజయం.. స్టేడియంలో భావోద్వేగాల మధ్య ప్రేక్షక లోకం అరుపులు.. వెరసి ఓ భీకర క్రికెట్ కాండకు తరుణమొచ్చింది. కేవలం ఆసియాకప్, ఐసీసీ లాంటి టోర్నీల్లోనే ప్రస్తుతం పాక్ వర్సెస్ ఇండియా తలపడుతున్నాయి. రెండు జట్లు మంచి ఫాంలో ఉండడంతో ఓ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తుంది.
#AsiaCup2022
#IndiavsPakistan
#RohitSharma
#ViratKohli
#Cricket
#BCCI
#India