Andhra Pradesh, AP High Court Questions Jagan Lead YSRCP Govt On Regularization Of Simhachalam Lands | సింహాచలం పంచగ్రామాల పరిధిలో జరిగిన ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా హైకోర్టు 2019లో స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరించడానికి వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సవాల్ చేస్తూ సింహాచలం ట్రస్టు తరఫున అశోక్ గజపతిరాజు పోరాడుతూనే ఉన్నారు. ఈ కేసు మరోసారి హైకోర్టులో నిన్న విచారణకు వచ్చింది. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది.మీవి కాని భూముల్ని ఎలా క్రమబద్ధీకరిస్తారంటూ ప్రశ్నించింది.
#APHighCourt
#SimhachalamLands
#jagangovt
#AndhraPradesh