Godavari floods: Telangana CM KCR Reviews on Bhadrachalam Godavari Floods |
గోదావరి నది మహోగ్ర రూపానికి భద్రాచలం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వరద ప్రవాహం తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదకర స్థాయిని దాటడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీవ్ర హెచ్చరికల జారీతో ముంపు బాధితులంతా పునరావాసాలకు చేరుతున్నారు. ఇళ్ల వద్ద ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
#Godavarifloods
#Bhadrachalam
#Telangana