Anakapalli జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పశువులపై దాడి చేస్తున్న పెద్దపులి గ్రామాలపైకి వస్తుందేనమోననే భయంతో వణికిపోతున్నారు. ప్రజల్లో భయాన్ని దూరం చేసేలా అటవీశాఖ అధికారులు, పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని దాన్ని చంపకూడదంటూ అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని ధైర్యం చెబుతున్నారు.