Khelo India Youth Games: అదరగొట్టిన అమ్మాయిలు AP కే గర్వకారణం *Sports | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-09

Views 25.7K

Three young Girls from the AP State won medals at the Khelo India Youth Games And making Andhra Pradesh proud | హరియాణాలోని పంచకులలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయిలు అదరగొట్టారు. ఈ పోటీల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన వెయిట్ లిఫ్టర్ పల్లవి ఏపీకి గోల్డ్ మెడల్ సాధించిపెట్టింది. బాలికల 64 కేజీల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణాన్ని సాధించింది. ఇక ఆమె స్నాచ్‌లో 84కిలోలు ఎత్తగా.. క్లీన్ అండ్ జెర్క్‌లో 104కిలోలు ఎత్తింది. మొత్తంగా 189కిలోలు లిఫ్ట్ చేసి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. ఇక బాలికల విభాగంలో 400మీటర్ల పరుగు పందెంలో పోలవరానికి చెందిన రజిత స్వర్ణ పతకం సాధించింది. ఆమె కేవలం 56.07సెకన్లలో గమ్యాన్ని ముద్దాడి పసిడి హారాన్ని పొందింది. ఇక అదే ఈవెంట్లో శ్రీకాకుళానికి చెందిన శిరీష 58సెకన్లలో పరుగు పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది.


#KheloIndiaYouthGames
#AndhraPradesh
#Sports

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS