ipl 2022 mega auction : ind vs wi odi series sensation odean smith to play for punjab kings in iol 2022
#odeansmith
#teamindia
#ipl2022
#ipl2022megaauction
#eoinmorgan
#aaronfinch
#krishnappagowtham
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కోటీ రూపాయల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలోకి వచ్చిన స్మిత్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. స్మిత్‌ను పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడి కొనుగోలు చేసింది. ఇటీవల భారత్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో రాణించడం స్మిత్‌కు కలిసొచ్చింది. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో, బాల్‌తో ఈ పేస్ ఆల్ రౌండర్ సత్తా చాటాడు. మిగతా వెస్టిండీస్ ఆటగాళ్లు విఫలమైన స్మిత్ మాత్రం రాణించాడు. దీంతో వేలంలో ఓడియన్ స్మిత్‌కు మంచి ధర లభించింది. కాగా ఐపీఎల్‌లో ఆడడం ఓడియన్ స్మిత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.