IPL 2022 Auction : Hardik Pandya కి హ్యాండ్ ఇవ్వనున్న MI, మరో ఆల్‌రౌండర్‌ కోసం || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-29

Views 238

IPL 2022 Retention Rules: Hardik Pandya may unlikely to be retained by MI. Mumbai Indians are likely to retain Rohit Sharma, Jasprit Bumrah and one of Suryakumar Yadav and Ishan Kisan as 3 of their local players.

#IPL2022RetentionRules
#IPL2022MegaAuction
#HardikPandya
#MumbaiIndians
#RTMs
#MI
#RohitSharma
#T20WorldCup

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలతో కళకళలాడనుంది. దీనితో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. వాటి షెడ్యూల్ సుదీర్ఘంగా ఉంటుంది. కొత్త జట్లు రానున్న నేపథ్యంలో- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్లేయర్ల రిటెయిన్ పాలసీని మార్చడంపై దృష్టి సారించింది. ఫలితంగా- దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది. కొత్త రిటెయిన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఏ జట్టు ఎవరిని వదిలించుకుంటుందనే విషయం మీద డిబేట్స్ ఆరంభం అయ్యాయి. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి.. ఈ సారి ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్లని ముంబై ఇండియన్స్‌పై దృష్టి పడింది. రోహిత్ శర్మ కేప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ ఎవరిని కొనసాగిస్తుంది? ఎవరిని సాగనంపుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని అంచనాలు సైతం వ్యక్తమౌతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS