ఆధునిక నియంతగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. తన తీరును మార్చుకోవట్లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ.. దాని మీద ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదు. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను చేస్తోన్నారు. అణ్వస్త్రాల ప్రయోగంపై అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయట్లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు కిమ్‌జొంగ్.
#KimJongun
#Japan
#NorthKorea
#SouthKorea
#Missiles
#UnitedStates
#JoeBiden