Fans troll Punjab Kings with epic memes as KL Rahul’s side fail to score 4 runs in final over against Rajasthan Royals
#IPL2021
#KartikTyagi
#PBKSvsRR
#PunjabKings
#SRHVSDC
#RajasthanRoyals
సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 4 పరుగులు చేయలేక ఓటమికి తలవించింది. రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ కార్తీక్ త్యాగి అద్భుతమైన బౌలింగ్‌కు పంజాబ్ చేతులెత్తేసింది. ఇలా గెలిచే మ్యాచ్‌లో ఓడటం పంజాబ్‌కు కొత్తేమి కాదు. గతంలో రెండు సూపర్ ఓవర్లు ఆడిన చరిత్ర ఆ జట్టుకు ఉంది. ఇదే రాజస్థాన్‌తో గతేడాది ఇదే యూఏఈ గడ్డపై రాహుల్ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్‌తో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో కూడా అదే తడబాటును కొనసాగిస్తోంది. ఇక తాజా ఫలితం నేపథ్యంలో పంజాబ్ జట్టుపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. 4 పరుగులు కొట్టలేరా? అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.