Kapil Dev Backs Virat Kohli..
#Kohli
#Teamindia
#ViratKohli
#KapilDev
#Rcb
#IPL2021
టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని వస్తున్న వార్తలను కపిల్ కొట్టిపారేశాడు. టీమిండియా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో కోహ్లీ గొప్పగా రాణించి జట్టుకు ఎన్నో విజయాలను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. సెంచరీనే కాదు ట్రిపుల్ సెంచరీ చేయగలడని కపిల్ దేవ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లీ మునుపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకున్న కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచుల కోసం యూఏఈ చేరుకున్నాడు.