Tokyo Olympics 2020 : Neeraj Chopra Wins India's First Gold Medal At The Tokyo Olympics

Oneindia Telugu 2021-08-07

Views 159

India’s Neeraj Chopra topped the men’s javelin throw scoreboard with a throw of 87.58 meters. This is the first medal in athletics for India after almost 100 years.
#NeerajChopra
#TokyoOlympics2020
#Athletics
#goldmedal
#javelinthrow
#mensjavelinthrow
#Tokyo2020
#javelin
#India

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్‌ అద్భుతంగా ఆడాడు. ఫలితంగా అథ్లెటిక్స్‌లో మెడల్ అందించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. జపాన్ నడిబోడ్డుపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో పసిడి లేని లోటు తీర్చాడు. మీరాభాయి చాను రజతంతో ఖాతా తెరిస్తే.. నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన ఇండియన్ అథ్లెట్‌‌గా రికార్డు సృష్టించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS