India vs England: Prithvi Shaw & Suryakumar Yadav set to fly to England on special provision
#Teamindia
#SuryaKumarYadav
#Bcci
#PrithviShaw
#Indvseng
భారత్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం పుట్టించింది. పలువురు యంగ్ క్రికెటర్ల కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి- టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ కేరీర్ ప్రస్తుతం డోలాయమానంలో పడింది. కరోనా వైరస్ బారిన పడ్డ స్పిన్నర్ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగినందున తోటి క్రికెటర్లతో పాటు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఐసొలేషన్‌లో కాలం వెల్లదీస్తోన్నారు. మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కావాల్సిన ఈ దశలో వారు శ్రీలంకలో ఐసొలేషన్‌లో ఉంటోన్నారు.