దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయడం లేదని మంగళవారం స్పష్టం అయింది. ఏబీ పునరాగమనం చేయట్లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) కూడా అధికారికంగా ప్రకటించింది. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ద్వారా ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో.. మిస్టర్ 360 నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ తేల్చి చెప్పాడు.
#ABdeVilliers
#ABdeVilliersRetirement
#MarkBoucher
#CricketSouthAfrica
#T20WorldCup
#Mr360
#SouthAfrica
#Cricket