IPL 2021 : Yuzvendra chahal playing his 100th ipl match.
#Ipl2021
#Chahal
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#Rcbvssrh
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున 100 మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్ చాహల్‌కు ఆర్‌సీబీ తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్. 2013లో ముంబై ఇండియన్స్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన యూజీ.. ఆ మరుసటి ఏడాదే ఆర్‌సీబీలో చేరాడు. తనదైన బౌలింగ్‌తో సత్తా చాటి అక్కడి నుంచి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇక 100వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఆర్‌సీబీ మీడియా టీమ్‌తో మాట్లాడిన చాహల్.. ఈ ఫీట్ సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇది ఎమోషనల్ జర్నీ అని పేర్కొన్నాడు.