బ్యాంకు లావాదేవీలు చేసే వారికి బ్యాడ్ న్యూస్. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక రేపు రెండో శనివారం కాగా..ఎల్లుండి ఆదివారం సెలవులు ఉండనున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
#Banks
#BankUnions
#BankHolidays
#BankPrivatisation