Anantapur Collector Gandham Chandrudu travels along with the students in APSRTC bus

Oneindia Telugu 2021-01-22

Views 173

Anantapur Collector Gandham Chandrudu travels along with the students in APSRTC bus, after he provided.

#GandhamChandrudu
#anantapurdistrictcollector
#AnantapurCollectortravelsinAPSRTCbus
#students
#AP
#AnantapurCollectorGandhamChandrudu
#IAS
#GandhamChandruduIAS


గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డి పల్లి గ్రామాలకు చెందిన కొందరు విద్యార్థినులు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపలి గ్రామాలకు చెందిన తాము బ్రహ్మసముద్రంలో ఉన్న ఉన్నత పాఠశాలను చేరుకోవడానికి రోజూ 10 కిలోమీటర్ల దూరం నడుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలని, ఆర్టీసీ బస్సును నడింపించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే గంధం చంద్రుడు స్పందించారు. ఆర్టీసీ అనంతపురం రీజనల్ మేనేజర్‌ను సంప్రదించారు. వెంటనే బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సమీపంలోని కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. బస్సును ప్రారంభించిన తరువాత.. అదే బస్సులో ఆయన గొంచిరెడ్డి పల్లి, నాగిరెడ్డి పల్లి మీదుగా ప్రయాణించారు. బ్రహ్మసముద్రం ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు కాస్సేపు పాఠాలు బోధించారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు


Share This Video


Download

  
Report form