India vs Australia : Haddin’s comments come in the wake of reports that India are reluctant to travel to the Gabba as they would be placed in hard quarantine - they can only move out of their hotel rooms for playing and training once they arrive in Brisbane.
#BradHaddin
#TeamIndia
#IndvsAus2020
#Brisbane
#MitchellStarc
#AjinkyaRahane
#IndvsAus3rdTest2020
#RohitSharma
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedShami
#Cricket
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. గురువారం సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది. అయితే బ్రిస్బేన్‌లో జరగాల్సిన చివరి టెస్ట్ సందిగ్ధంలో పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విధించే ఆంక్షలతో టీమిండియా.. నాల్గో టెస్టు ఆడలేమని అంటోంది. క్వీన్‌లాండ్స్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు ఎక్కువగా ఉండటంతో.. మ్యాచ్‌ను బ్రిస్బేన్‌లోనే నిర్వహించినా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని సీఏ చూస్తోంది. అయితే దీనికి టీమిండియా ఒప్పుకోవడం లేదు.
చివరి టెస్ట్ కోసం ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్స్ చార్టర్డ్ విమానాల్లో బ్రిస్బేన్‌కు వెళ్లనున్నారు. బ్రిస్బేన్‌కు వెళ్లిన తర్వాత ప్రాక్టీస్, మ్యాచ్‌ల సందర్భంగానే టీమ్స్ బయటకు రావాలని.. మిగతా సమయం మొత్తం హోటల్ రూమ్‌లకే పరిమితం కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది. ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నామని, మళ్లీ ఐసోలేషన్ అంటే మా వాళ్ల కాదని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి ఆదివారం క్రిక్‌బజ్‌తో అన్నాడు. ఒక్క మ్యాచ్ కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.