సైనిక సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. కోవిడ్ మహమ్మారిని దేశం ఎదుర్కొంటున్న తరుణంలో నరవణే చేపడుతున్న ఐదో విదేశీ పర్యటన ఇది. ఇప్పటికే మయన్మార్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు నరవణే వెళ్లివచ్చారు. మూడు రోజుల (28-30) దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆ దేశ సీనియర్ మిలటరీ అధికారులతోనూ, ప్రభుత్వాధినేతలతోనూ ఆయన సమావేశమవుతారు.
#ArmyChiefGeneral
#MMNaravane
#SouthKorea
#IndianArmy
#Defence
#Military