ఎంజి మోటార్ ఇండియా తమ కొత్త గ్లోస్టర్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎంజి గ్లోస్టర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది మరియు ఇప్పుడు మార్కెట్లో రూ. 28.98 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో లభిస్తుంది.
ఎంజి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ & సావి అనే నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. ప్రతి వేరియంట్లు అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ ధర రూ. 28.98 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ 'సావీ' ట్రిమ్ ధర రూ. 35.38 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.