No Decision Taken on Bus Services Between Two Telugu States | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-16

Views 2

In AP,TS RTC Officials Meet, No Decision Taken on Bus Services Between Two Telugu States.The meeting of RTC officials, who have already met several times on the transport of RTC buses between AP and Telangana states, ended without any clarification on the RTC bus services between the two states


#RTCBusServices
#APSRTCMDKrishnaBabu
#BusServicesTeluguStates
#APSRTC
#TSRTC
#APTSRTCOfficialsMeet
#CMKCR
#APCMJagan
#Telanganastate
#TeluguStates

తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరణకు సంబంధించి జరుగుతున్న చర్చలు మరోమారు ఎటూ తేలకుండా ముగిశాయి. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన భేటీ అయిన అధికారులు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించే కిలోమీటర్ల మేర, బస్సులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాపై భేటీ అయిన ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఎటూ తేల్చకుండానే ముగిసింది. చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో ప్రతిష్టంభన నెలకొంది. సమావేశం అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఎండి కృష్ణ బాబు చర్చలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కిలోమీటర్ల పై ప్రధానంగా చర్చ జరిగిందని, ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలని అంశంపైన కూడా చర్చించామని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు నడవడానికి ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు. కిలోమీటర్ల గ్యాప్ 50% తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తెలంగాణ ఆర్టీసీని 50 శాతం పెంచుకోమని చెప్పామని కృష్ణ బాబు పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS