టయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ఆగస్టు 22 న భారతదేశంలో ప్రారంభించబడింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునేవారు 11,000 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. టయోటా అర్బన్ క్రూయిజర్‌ను సెప్టెంబర్ 23 న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ మిడ్, హై, ప్రీమియం అనే మూడు వేరియంట్లలో తీసుకురాబోతోంది, కంపెనీ బేస్ వేరియంట్లో చాలా ఫీచర్లు మరియు పరికరాలను కూడా అందిస్తోంది. ఇటీవల రెస్పెక్ట్ ప్యాకేజీని ప్రకటించారు, దీని కింద కంపెనీ ముందుగానే బుక్ చేసుకునే వినియోగదారులకు అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలో 2 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ అందిస్తుంది.