భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్'లో అప్‌డేటెడ్ 2020 బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫ్రంట్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ మోటార్‌సైకిల్ లభ్యం కానుంది.
హీరో మోటోకార్ప్ గత 2019 EICMAలో ప్రదర్శించిన 1.R కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రత్యక్ష ప్రేరణ పొంది హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను డిజైన్ చేశారు. ఇందులో ప్రొడక్షన్-రెడీ మోడల్ మొట్టమొదటిగా ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ కార్యక్రమంలో ప్రదర్శించారు.