#JusticeForJayarajAndBennix: మౌనం వహించేవాళ్లు కూడా శిక్షార్హులేనని కమల్ హాసన్ ఆగ్రహం!!

Oneindia Telugu 2020-06-29

Views 300

TN Govt Plans to CBI Probe In JusticeForJayarajAndBennix Case
#JusticeForJayarajAndBennix
#JayarajAndFenixCBIProbe
#JayarajAndFenix
#KamalHaasan
#TamilNadu
#TamilNaduFatherAndSon
#PoliceCustody
#TamilNaduPolice
#CMPalaniswami
#DMK

తమిళనాడులో చోటు చేసుకున్న జయరాజ్,బెనిక్స్‌ల కస్టోడియల్ డెత్‌పై అమెరికా జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరహాలో నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్‌లో ముందుండి పనిచేస్తున్నారన్న ప్రశంసలు మూటగట్టుకున్న పోలీస్ వ్యవస్థ పైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యకు పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించనుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్రాస్ హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం.' అని ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. మద్రాస్ హైకోర్టు దీన్ని సుమోటో కేసుగా తీసుకుందన్నారు.లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల కింద ఆ తండ్రీ కొడుకులను కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాతి రోజు రిమాండ్‌కు తరలించారని.. ఆ మరుసటిరోజే ఇద్దరూ మృతి చెందారని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS