Team india captain Virat Kohli looked frustrated when Henry Nicholls decided to take a review when the designated 15 seconds had almost lapsed.
#IndvsNZ2ndODI
#IndiavsNewZealand
#RavindraJadeja
#viratkohli
#INDVSNZ
#KedarJadhav
#navdeepsaini
#ManishPandey
#RossTaylor
#ShreyasIyer
#KLRahul
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ ఇన్నింగ్స్ చివరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో డీఆర్‌ఎస్ విషయమై ఫీల్డ్ అంపైర్లతో కోహ్లీ కాసేపు వాదనకి దిగాడు.
అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 16వ ఓవర్ఐదో బంతి వేసిన మణికట్టు స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ హెన్రీ నికోలస్ (41: 59 బంతుల్లో 5x4) వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకడంతో భారత్ ఫీల్డర్లు ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ వేలెత్తేశాడు.