IND VS NZ,1st ODI : One of the major positives for India in the recent past was KL Rahul’s wicket-keeping Work, which gave the team management a chance to add an extra batsman in the lineup. Though the move came out positive, the former skipper Kapil Dev raised his concern over Rishabh Pant’s future in the Indian National Cricket team.
#RishabhPant
#indvsnz2020
#indvsnz1stODI
#KLRahul
#KapilDev
#sunilgavaskar
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఓ సలహా, సూచనలు ఇచ్చారు. ముందుగా 20, 30, 50, 70 పరుగులు చేయటానికి ప్రయత్నించు.. ఆ తర్వాత సెంచరీ గురించి ఆలోచించు అని సూచించారు. పంత్‌కు మంచి భవిష్యత్తు ఉందని, వచ్చిన అవకాశాల్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం కొంచెం విచిత్రంగా ఉందన్నారు.
తాజాగా కపిల్ దేవ్ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ నిరుత్సాహపడకూడదు. అవకాశాలు తప్పకుండా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విమర్శకులకు తన ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలి. పంత్‌కు మంచి భవిష్యత్తు ఉంది. సెంచరీ సాధించాలనుకుంటే ముందుగా 20 పరుగులు చేయటానికి ప్రయత్నించు.. ఆ తర్వాత 20, 30, 50, 70 చేస్తూ సెంచరీ సాధించు అని సునిల్ గావస్కర్ చెబుతుండేవాడు. పంత్ కూడా ఈ తరహా ఆలోచనతోనే బ్యాటింగ్ చేయాలి' అని అన్నారు.
'భారీ ఇన్నింగ్స్ ఆలోచనతో పంత్ బరిలోకి దిగకూడదు. 5-10 మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భావించాలి. అప్పుడే బాగా ఆడగలడు. పంత్ మంచి ప్రదర్శన చేస్తే.. అతడిని ఎవరూ ఆపలేరు. ఓపెనర్‌గా వచ్చినా, పదో స్థానంలో బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఉత్తమ ప్రదర్శన చేయాలి. స్థానంతో సంబంధం లేకుండా ఆడాలి. అతడిపై కొన్ని బాధ్యతలు ఉన్నాయి' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.