ds : #Budget2020: Footwear, Furniture, Imported medical equipment, Cigarettes, Tobacco products, Wall fans may get costlier. Raw sugar, Skimmed milk may get Cheaper
Import of newsprint, lightweight coated paper reduced to 5%.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#IDBIBank
#economicslowdown
#nirmalasitharaman
#Footwear
#alcoholicbeverages
#Importedmedicalequipment
#Wallfans
#Tobaccoproducts
2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నాయి..? ఏయే వస్తువుల పెరగబోతున్నాయి..? ఏవి తగ్గబోతున్నాయో.. తెలుసుకుందాం
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాల్ ఫ్యాన్ల కస్టమ్స్ డ్యూటీ పెంచుతామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతోపాటు పింగాణి పాత్రలు, వంట గదికి సంబంధించిన వస్తువులపై కూడా పన్ను పోటు పెరిగింది. వాల్ ఫ్యాన్లపై పన్ను ఇప్పుడు 7.5 శాతం ఉంది. దానిని 20 శాతానికి పెంచారు. పింగాణి పాత్రలు, వంట గది వస్తువులపై కూడా పన్ను పెరుగుతోందని పేర్కొన్నారు. చైనా సిరామిక్, క్లై ఐరన్, స్టీల్, రాగి పాత్రలపై కూడా పన్నుపోటు విధించారు. సిగరేట్లు, పొగాకు ఉత్పత్తులు, ఫుట్‌వేర్, ఫర్నీచర్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మందుల ధర కూడా పెరగనుంది.
వస్తువులే కాదు కమర్షియల్ వాహనాలపై కూడా ట్యాక్స్ వేశారు. కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ విధించారు. ఈ-కామర్స్ ఆపరేటర్లు అన్ని లావాదేవీలకు సంబంధించి ప్యాన్/ఆధార్ కార్డు వివరాలు అందజేస్తే 1 శాతం,
వివరాలు అందించకుంటే 5 శాతం చొప్పున పన్ను విధిస్తామని ప్రకటించారు.