Former India captain MS Dhoni, who has been on a sabbatical since India's exit from the World Cup, regrets not putting in the extra effort when he was run out during the semifinal against New Zealand in the World Cup 2019.
#dhoni
#dhonirunout
#worldcup2019semifinal
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#cricket
#teamindia
గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-20019లో టీమిండియా సెమీస్ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకుపోయి కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనూహ్యంగా రనౌట్‌కు గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. దీంతో కప్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ భారంగా ఇంటిముఖం పట్టింది.
తాజాగా ప్రపంచకప్ రనౌట్‌పై ధోనీ స్పందించాడు. ఒక మీడియాతో మాట్లాడుతూ చాలా బాధపడ్డాడు. 'నేను ఆడిన తొలి మ్యాచ్‌లో రనౌట్ అయ్యా. మళ్లీ సెమీస్ మ్యాచ్‌లో అలానే రనౌట్ అయ్యాను. ఈ రెండు రనౌట్‌లపై ఇప్పటికీ బాధపడుతుంటా. ప్రపంచకప్‌లో ఎందుకు డైవ్ చేయలేకపోయా? అని ప్రశ్నించుకుంటా. ఆ రెండు ఇంచులను డైవ్ చేయాల్సిందని అనుకుంటా' అని ధోనీ పేర్కొన్నాడు.