India vs Sri Lanka 2nd T20I : Shardul Thakur (3-23) and Navdeep Saini (2-18) helped India beat Sri Lanka by 7 wickets
#IndiavsSriLanka2ndT20I
#CricketNews
#IndVsSL3rdt20iCricket
#Dhawan
#viratkohli
#Bumrah
#ShardulThakur
#NavdeepSaini
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 విజయ లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 పోర్లు), శిఖర్ ధావన్(32; 29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం చేసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా శ్రేయస్ అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ కోహ్లీ(30; 17 బంతుల్లో ఫోర్, 2 సిక్సులు)తో టీమిండియాకు విజయాన్ని అందించారు. భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) సిక్స్ కొట్టడంతో 17.3 ఓవర్‌లోనే టీమిండియా విజయం సాధించింది.