AP TDP Leaders Meet Governor Biswabhusan Harichandan| వైసీపీ నేతల వేధింపులపై గవర్నర్‌కు టీడీపీ బృందం

Oneindia Telugu 2019-10-22

Views 549

Andhra Pradesh TDP leaders met the state Governor Biswabhusan Harichandan. They have filed a complaint Over the YSRCP government.In the complaint, they have also alleged that the ruling YSRCP government has been targeting the opposition TDP Leaders
#vijayawadampkesineninani
#tdpleaders
#GovernorBiswabhusan
#YSRCP
#TDP
#chandrababu
#jagan

వైసీపీ నేతల వేధింపులపై గవర్నర్‌కు టీడీపీ బృందం మంగళవారం ఫిర్యాదు చేసింది. అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జగన్ రాక్షస పాలన సాగుతుందని, విపక్ష నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. రౌడీయిజం, రాక్షసత్వం, ఫ్యాక్షనిజం...ఇదే ఏపీలో నడుస్తోందన్నారు. ఘోరాలు, నేరాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాని ఆరోపించారు.నిజాయితీ అధికారులు, అధ్యాపకులపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని కేశినేని నాని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అరాచకాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించామన్నారు. అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారని అన్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటన...రాష్ట్రాభివృద్ధి కోసమా?, కేసుల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలోని కట్టడాలను కూల్చడం మినహా... జగన్ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడని కేశినేని నాని నిలదీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS