TTD funds misused by TDP leaders for Dharma Porata Deeksha is confirmed by TTD Vigilence. On complaints TTD ordered for vigilence probe on this matter. After investigation vigilence confirmed mis use of TTD funds for political activity.
#chandrababunaidu
#TTDFunds
#ysjagan
#TDPLeaders
#yvsubbareddy
#naralokesh
#TTDVigilence
#andhrapradesh
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలకు టీటీడీ నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయ నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టమైంది. ప్రీ ఆడిట్ లేకుండానే నిధులు వెచ్చించినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. దీని పైన మూడు రోజులుగా తిరుపతి విజిలెన్స్ డీఎస్పీ మల్లేశ్వర రెడ్డి టీం ఢిల్లీలో తనిఖీలు నిర్వహించారు. అందులో ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటుగా పార్టీ నేతలు ..తరలి వచ్చిన అనేక మంది కోసం ఈ నిధులు వెచ్చించినట్లుగా గుర్తించారు. ఈ దీక్షలకు టీటీడీ నిధులు దాదాపు నాలుగు కోట్ల రూపాయాల వరకు ఖర్చు చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ విచారణ సాగింది. అందులో ఈ ఫిర్యాదులు నిజమేనని విజిలెన్స్ తేల్చినట్లుగా ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు.