Huzurnagar Bypoll Turns As Prestige Issue In Telangana || ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్‌నగర్ ఎన్నిక

Oneindia Telugu 2019-09-30

Views 1

huzurnagar by poll nomination process will be complete. total 60 to 80 members are in race. nomination scrutiny on October 1st, withdraw of namination 3rd of October. poll will be conduct October 21st, counting.. result announce on October 24th.
#HuzurnagarBypoll
#Congress
#uttamkumarareddy
#padmavathi
#trs
#kcr
#tdp
#bjp

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తవ్వాలి. కానీ భారీగా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడంతో నామినేషన్ల స్వీకరణ ఆలస్యమవుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు 60 నామినేషన్లు ఇప్పటికే దాఖలైనట్టు తెలుస్తోంది. మరో 20 మంది అభ్యర్థులు క్యూ లైన్‌లో ఉన్నారని హుజూర్‌నగర్ రెవెన్యూ సిబ్బంది మీడియాకు వివరించారు.నామినేషన్లను మంగళవారం స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 3 వరకు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. వచ్చేనెల 21న పోలింగ్ నిర్వహించి.. 24న ఫలితాలు వెల్లడిస్తారు. హుజూర్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హుజూర్‌నగర్ గడ్డ మీద గెలిచి చరిత్ర తిరగరాయాలని భావిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS