Khanderi, India's 2nd Scorpene Submarine,Commissioned By Rajnath Singh || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-30

Views 35

Union Defence Minister Rajnath Singh commissioned the second Kalvari-class submarine INS Khanderi on September 28 in Mumbai. Khanderi is built at state-run Mazgaon Dock Limited and underwent rigorous sea trials for over two and a half years. Later, Singh also toured INS Khanderi and was accompanied by Navy Chief Admiral Karambir Singh.
#Khanderi
#India's2ndScorpeneSubmarine
#RajnathSingh
#navy
#modi
#imrankhan
#Mumbai
#MazgaonDockLimited
#howdimodi


సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశానికి భద్రత పరంగా పదాతి, వాయుసేనతో పాటు నావికాదళం కూడా ఎంతో కీలకం. భారత్ కూడా తన నావికాదళాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకుంటోంది. దేశీయంగానూ తయారుచేస్తోంది. తాజాగా, ఐఎన్ఎస్ ఖండేరీ సబ్ మెరైన్ అన్ని హంగులు పూర్తిచేసుకుని విధి నిర్వహణ కోసం సర్వసన్నద్ధమైంది. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండేరీని నేవీకి అప్పగించారు.భారత నౌకాదళం అమ్ములపొదిలోకి స్కార్పిన్‌ తరగతికి చెందిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‘ఖండేరీ’ చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో శనివారం దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నేవీ అధికారులను ఉద్దేశించి ‘దేశం వారిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరిస్తారని తాను విశ‍్వసిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు ఆయన ఈ సందర్భంగా వార్నింగ్‌ ఇచ్చారు. ఖండేరి లాంటి జ‌లాంత‌ర్గాముల‌తో పాక్‌కు గ‌ట్టి స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌మన్నారు. జమ్ము కశ్మీర్‌ అంశంపై భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోందని, అయితే పాకిస్తాన్‌ మాత్రం కావాలనే రచ్చ చేస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ దుయ్యబట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS