కోడెల షోరూమ్‌ నుండి అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలించిన అధికారులు || Assembly Furniture Moved To Velagapudi

Oneindia Telugu 2019-08-27

Views 435

The TDP leadership is in a fix over extending support to former AP Legislative Assembly Speaker Kodela Siva Prasad Rao, who has been involved in a series of controversies. Apart from political opponents, leaders within the TDP are also coming out against Kodela, much to the dismay of party supremo N Chandrababu Naidu. Apart from allegations of corruption and irregularities, now Kodela is in a spot for using the furniture of Assembly for personal purpose
#kodelaprasadarao
#politicalfuture
#TDP
#YSRCP
#jagan
#chandrababu
#sattenapalli
#narsaraopet


ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంట్లో అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్ కనిపించడం వివాదానికి తెరలేపింది. ఇప్పటికే పలు ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుటుంబం.. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్‌ను కూడా వాడుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నిచర్ ను తరలిస్తుండగా సామాన్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వక లేఖలు రాశానని, ఆ తర్వాతే ఫర్నిచర్‌ను తీసుకువెళ్లానని వెల్లడించారు. అయితే, తాను రాసిన లేఖపై అసెంబ్లీ కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని కోడెల చెప్పారు.ఇప్పటికైనా అసెంబ్లీ అధికారులు వస్తే ఫర్నిచర్‌ను అప్పగిస్తానని, లేదంటే ఆ ఖర్చు ఎంత అయ్యిందో చెప్తే ఆ మొత్తం చెల్లిస్తానని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS