AP Govt given cabinet rank for Chief Whips in legislative council and Assembly. Deputy minister rank for Whips. With this decision those leaders feeling satisfaction.
#appolitics
#legislativecouncil
#APassembly
#ysjagan
#ysrcp
#cheifwhips
#apcabinet
#andhrapradesh
#APgovernment
జగన్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా వారికి మంత్రి హోదా దక్కిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి గెలవటంతో అనేక మంది నేతలు తమకు జగన్ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని ఆశించారు. అయితే పక్కగా తన కేబినెట్ కూర్పులో ప్రాంతీయ - సామా జిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. అనేక మంది సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు.ఇదే సమయంలో తొలి నుండి జగన్‌తోనే ఉన్న పలువురు నేతలను జగన్ బుజ్జగించి వారికి ప్రత్యామ్నాయ పదవులతో సంతృప్తి పరచాల్సి వచ్చింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఇద్దరికి కేబినెట్ మంత్రి..ఆరుగురికి సహాయ మంత్రుల హోదా దక్కనుంది.