Lasith Malinga, 35, has announced he will be retiring from ODI cricket after the first ODI of a three-match series between Sri Lanka and Bangladesh on Friday.
#LasithMalingaretire
#LasithMalinga
#slvban
#SriLankapacer
#cricket
యార్కర్ల కింగ్, శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు ఆడుతాడు.
బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ... 'వన్డేల నుంచి రిటైర్ అవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది. గత 15 సంవత్సరాలుగా శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించా. లంక విజయాల కోసం కెరీర్‌లో నా వంతు ప్రయత్నం చేశా. నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్లాలి' అని మలింగ పేర్కొన్నాడు.