It has been several days since Janasena chief Pawan Kalyan's appearance in AP. Gabbar Singh has not yet begun to respond to government policies, asking if there are government policies on the public. In fact, Janasena was not so keen on responding to the developments in AP, Polavaram, Rajdhani and budget allocations.
#appolitics
#janasena
#pavankalyan
#apassembly
#rulingparty
#budget
ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించి చాలా రోజులవుతోంది. ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉంటే ప్రశ్నించి తీరుతామన్న గబ్బర్ సింగ్ ప్రభుత్వ విధానాలపై ఇంకా స్పందించడం మొదలు పెట్టలేదు. నిజానికి ఏపి లో జరుగుతున్న పరిణామాలపైన, పోలవరం, రాజదాని నిర్మాణం, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై స్పందించే అవకాశం వచ్చినా జనసేనాని అంతంగా దృష్టి కేంద్రీకరించలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జరుగుతున్న రాజకీయ చర్చలపై కూడా జనసేనాని స్పందించ వచ్చు. శాసన సభలో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి హావభాలపైన ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ, సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించిన సందర్బాలు ఉన్నాయి. ఐతే జనసేనాని స్పందన వేవిద్యంగా ఉంటుంది కాబట్టి గబ్బర్ సింగ్ కురిపించే ప్రశ్నలకోసం ప్రజానికం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.