Video Link: https://telugu.mykhel.com/cricket/watch-team-india-take-part-in-unique-fielding-drill-ahead/articlecontent-pf28065-020894.html
ICC Worrld Cup 2019:Virat Kohli and his men were seen perfecting their direct hits as the Indian team took part in a unique fielding drill in Southampton on Thursday.
#iccworldcup2019
#viratkohli
#indvssa
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#klrahul
#cricket
#teamindia
వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఫీల్డింగ్ ఎంతో కీలకం. గతంలో క్యాచ్‌లు, రనౌట్ల వల్ల మ్యాచ్ ఫలితాలు తారుమారైన ఎన్నో సందర్భాలను మనం చూశాం. ఫీల్డింగ్ విషయంలో క్యాచ్‌లకు సంబంధించినంత వరకూ టీమిండియా ఫరవాలేదు గానీ... డైరెక్ట్ త్రోలను విసరడంలో మన ఫీల్డర్లు పూర్తిగా విఫలమవుతున్నారు.
దీంతో టీమిండియాను ఫీల్డింగ్ సమస్య వేధిస్తోంది. వరల్డ్‌కప్‌లో ఈ బలహీనతను అధిగమించేందుకు గాను ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ప్రాక్టీస్ సెషన్లలో కొత్త పద్థతులతో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
ఈ మ్యాచ్ జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడి చేరుకున్న టీమిండియా గురువారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా ‘రౌండ్ ద క్లాక్'పై ఎక్కువగా దృష్టి సారించింది. ‘రౌండ్ ద క్లాక్' అంటే ఆరు విభిన్న ప్రాంతాల్లో ఫీల్డింగ్ చేస్తూ నాన్‌స్ట్రయికర్‌వైపు ఉండే వికెట్లను మొత్తం 20సార్లు పడగొట్టడం.
20సార్లు వికెట్ పడగొట్టడంలో సఫలమైన క్రికెటర్‌ను ఈ సెషన్ నుంచి తప్పించారు. విఫలమైన క్రికెటర్‌తో కోచ్ ఆర్.శ్రీధర్ మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.