ICC World Cup 2019: Virat Kohli's Wax Statue Display At Lord's Stadium | Oneindia Telugu

Oneindia Telugu 2019-05-30

Views 172

Renowned wax museum Madame Tussauds on Wednesday unveiled India captain Virat Kohli's statue at Lord's Cricket Ground here to mark the launch of the ICC World Cup.The wax statue of one of the world's leading batsmen will be on display at Madame Tussauds from Thursday until July 15 remaining at the museum for the duration of the tournament.
#viratkohli
#waxstatue
#lords
#icccricketworldcup2019
#teamindia
#cwc2019
#London

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీకి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. వరల్డ్‌కప్‌కు ముందు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ నిర్వాకులు బుధవారం ఆవిష్కరించారు.

కోహ్లీ మైనపు విగ్రహం టీమిండియా కిట్‌ను ధరించి ఉంది. తాజా విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఉస్సేన్ బోల్ట్, మో ఫరా, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాల సరసన విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, 12వ వరల్డ్‌కప్ ఎడిషన్ అధికారికంగా బుధవారం ప్రారంభమైంది. మాల్ రోడ్డులో ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ దగ్గరలోని ప్రఖ్యాత మాల్‌లో ప్రారంభ వేడుకలను ఘనంంగా నిర్వహించారు. దాదాపు గంటసేపు జరిగిన కార్యక్రమం అభిమానులను అలరించింది. ఈ ప్రారంభ వేడుకలకు క్రికెట్‌ అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. పది జట్ల కెప్టెన్లు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS