సీఎం కేసీఆర్ చొరవ తో... రైతు కుటుంబంలో ఆనందం!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-28

Views 2

English summary The Young farmer Sharath has been accused of harassing revenue employees. He Posted his version in social media. CM KCR approached the victim by a phone call and he promise to help. Soon he ordered the district collector to help the victim family. Collector given land records and rythu banhdu cheque to victim family and Revenue employees linked with this issue were suspended.
#kcr
#kalvakuntlachandrashekarrao
#cmkcr
#telangana
#mancherial
#farmer
#rythubandhu

రైతు కుటుంబాన్ని వేధిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలో బాధితులకు న్యాయం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తమ బాధను పంచుకున్న యువరైతు శరత్ కన్నీటిగాధ కేసీఆర్ ను కదిలించింది. స్వయంగా ఆయనే ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ మేరకు శరత్ కుటుంబానికి సంబంధించిన భూముల పట్టాతో పాటు రైతు బంధు చెక్కు కూడా అందించారు. అటు ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.శరత్ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. తమ భూమికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి మహాప్రభో అంటూ రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. కాసుల కక్కుర్తికి ఇతర వ్యక్తులతో కుమ్మక్కైన ఉద్యోగులు.. ఆ భూమికి మీకు సంబంధం లేదంటూ వేధించారు. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన బాధిత కుటుంబం సోషల్ మీడియాను అస్త్రంగా మలచుకుంది. తమకు జరిగిన అన్యాయం సీఎం కేసీఆర్ వరకు వెళ్లేలా షేర్ చేయాలంటూ పోస్టును వైరల్ చేశారు. అది కాస్తా కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. స్వయంగా ఫోన్లో మాట్లాడిన కేసీఆర్.. గంటల వ్యవధిలో వారికి న్యాయం జరిగేలా చూశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS