The Election Commission has released the final voters list for the AP elections on Monday. According to the list, 3,93,12,192 voters are there.
#electioncommission
#apassemblyelection2019
#eastgodavari
#vizianagaram
#voter
#tdp
#ysrcp
#janasena
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మంది ఓటర్లు ఉన్నారు.వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11 తర్వాత 25 లక్షల 20 వేల 924 మంది ఓటర్లను చేర్చగా.. అందులో వివిధ కారణాలతో 1 లక్ష 41 వేల 823 మంది ఓటర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42 లక్షల 4 వేల 436 మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18 లక్షల 18 వేల 16 మంది ఓటర్లు నమోదయ్యారు.