India vs Australia 2019: 4th ODI Match Highlights | Turner's quick Score Of 84 Runs Helps Aus To Win

Oneindia Telugu 2019-03-11

Views 14

Unheralded Ashton Turner took an experienced Indian attack to the cleaners with some unbelievable hitting, helping Australia chase down a record breaking target of 359 runs and level the five-match series here on Sunday (March 10). It was the highest ever total that Indian team failed to defend in its ODI history, losing the game by four wickets.
#indiavsaustralia
#australiainindia 2019
#4thodi
#ashtonturner
#cricket
#shikhardhawan
#teamindia
#rohitsharma
#viratkohli
#rishabpanth
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఓటమి పాలైంది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఆసీస్ ఆటగాడు టర్నర్ (84 నాటౌట్: 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు)‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఆసీస్‌ ఆటగాడు ఆస్టన్‌ టర్నర్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ (0), షాన్ మార్ష్ నిరాశపరిచినా.. హ్యాండ్స్‌కబ్ (117), ఉస్మాన్ ఖవాజా (91)ల జోడీ మూడో వికెట్‌కి అభేద్యంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS