Akhil Akkineni's Fourth film confirmed with Bommarillu Bhaskar, Geetha Arts production.
#AkhilAkkineni
#BommarilluBhaskar
#GeethaArts
#alluaravind
#mr.majnu
#nagarjuna
#tollywood
అక్కినేని యువ వారసుడు అఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ అఖిల్ కు విజయాన్ని అందించలేకపోయాయి. దీనితో అఖిల్ తొలి విజయం కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పడం లేదు. వెంకీ అట్లూరి దర్శత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం మిస్టర్ మజ్నుపై మంచి అంచనాలతో విడుదలయింది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం అఖిల్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి.
అఖిల్ తదుపరి చిత్రం గీత గోవిందం దర్శకుడు పరుశురాంతో కానీ, బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో కానీ ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో అఖిల్ నటించనుండడం దాదాపుగా ఖరారయింది. అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ చిత్రం క్రేజీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో తెరకెక్కబోతోంది.
బొమ్మరిల్లు చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన భాస్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. భాస్కర్ తెరకెక్కించిన చివరి చిత్రం ఒంగోలు గిత్త. 2013లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో భాస్కర్ సినిమాల నుంచి కనుమరుగైపొయ్యాడు. ఎట్టకేలకు అతడికి ఓ అవకాశం వచ్చింది. అఖిల్ హీరో, గీత ఆర్ట్స్ నిర్మాణం.. తనని తాను నిరూపించుకునేందుకు భాస్కర్ కు ఇంతకంటే అద్భుత అవకాశం రాదనే చెప్పాలి. అఖిల్ కూడా ఫస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
అఖిల్ కు విజయాన్ని అందించేందుకు అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తాడట. బన్నీ వాసు నిర్మాత. గోపి సుందర్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి ప్రేమ కథలు తెరకెక్కించిన భాస్కర్ అఖిల్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడనే ఆసక్తి నెలకొంది.