Harish Rao's Speaks To Media After The Telangana Cabinet Meeting

Oneindia Telugu 2019-02-19

Views 707

There is a campaign of social media on Harish Rao's absence during the expansion of the Telangana Cabinet. After the swearing in of the ministers, he spoke to the media. CM KCR has assumed that he will carry out any assignment.
#Telanganacabinet
#harisharao
#CMKCR
#KTR
#etelarajendar
#mpkavitha
#telangana

తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోటు లభించకపోవడంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు ఏ బాద్యత అప్పగించిన నిర్వర్తిస్తానని తేల్చిచెప్పారు.
టీఆర్ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ గల సైనికుడినని స్పష్టంచేశారు హరీశ్ రావు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలు, వివిధ అంశాల ప్రాతిపదికన తీసుకొని చేపట్టారని గుర్తుచేశారు. ఈ సారి కొత్తగా ఆరుగురికి చోటు దక్కడం ... వివిధ అంశాల నేపథ్యంలో కూర్పు జరిగిందని వివరించారు. కేబినెట్ లో తనకు బెర్త్ దక్కకపోవడంపై ఎలాంటి అసంత్రుప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న ప్రచారానికి తెరదించాలని కోరారు. ఈ ప్రచారంతో తనకు, అనుయాములకు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారానికి సంబంధం లేదన్నారు. తనకు ఎలాంటి సేనలు, గ్రూపులు లేవని తేల్చిచెప్పారు.
తనకు ఏ పని అప్పగించినా ... నిర్వర్తిస్తానన్నారు హరీశ్ రావు. సీఎం కేసీఆర్ అప్పగించిన పని బాధ్యతాయుతంగా చేపడుతానని స్పష్టంచేశారు. పార్టీ ఉన్నతి కోసం క్రమశిక్షణ గల సైనికుడిగా పాటుపడుతానని .. అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS