India vs Australia 2019:Virat Kohli Return,Dhawan-Rohit Sharma Rested ? India's Probable ODI Squad

Oneindia Telugu 2019-02-15

Views 67

Virat Kohli to return, the pair of Rohit Sharma-Shikhar Dhawan rested, Rishabh Pant in? Here is India's probable ODI squad for the five one-dayers against Australia at home.
#IndvsAus2019
#ViratKohli
#MSDhoni
#RohitSharma
#RishabhPant
#ShikharDhawan
#IndvsausProbableODISquad

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న సుదీర్ఘ పర్యటన కోసం వన్డే జట్టుని ప్రకటించేందుకు భారత సెలక్టర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. వరల్డ్‌కప్‌ ముందు టీమిండియా ఆడే చివరి వన్డే సిరిస్ కావడంతో జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫిబ్రవరి 24 నుంచి భారత్ గడ్డపై ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. వరల్డ్ కప్ కోసం గతేడాది కాలంగా రొటేషన్ పద్ధతిలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లకి విశ్రాంతినిస్తున్న సెలక్టర్లు.. ఆసీస్‌తో జరిగే సిరిస్‌లో‌ఎవరికి విశ్రాంతిస్తారు? ఎవరిని పరీక్షిస్తారు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్ ముగిసే నాటికి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై పూర్తి స్పష్టత రానుందని ఇటీవలే ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే..
ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 5వ తేదీన సఫారీలతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేఫథ్యంలో రొటేషన్ పద్ధతిలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఈసారి రోహిత్ శర్మ, భువనేశ్వర్‌కి విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS