Ball that touched Neesham body left the wicket from Dhoni's side. It took a couple of seconds to find out where the ball went. At the same time, he went out of the crease to run the ball in the back of the wickets. But he threw it into the wicket in the blade of the ball that he had already received.
#INDVsNewZealand
#5thodi
#dhoni
#nesham
#runout
#netizens
#kedarjadhav
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత అప్రమత్తంగా ఉంటాడో అనే దానికి భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మరోసారి గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఈ దశలో క్రీజులోని బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్ (44: 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో కేదార్ జాదవ్‌ని బౌలింగ్‌కి పిలిపించిన ధోని, తెలివిగా నీషమ్‌ని ఔట్ చేసి మళ్లీ రేసులోకి భారత్‌ను తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించాడు.
అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది. బంతి ఎక్కడికి వెళ్లిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం పట్టింది.అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు.
ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలిపోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో జేమ్స్ నీషమ్ (44), విలియమ్సన్ (39) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో చాహల్ (3/41), మహ్మద్ షమీ (2/35), హార్దిక్ పాండ్య (2/50) అద్భుత ప్రదర్శన చేశారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసింది. భారత క్రికెట్ జట్టు... బుధవారం నుంచి కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.